కుటుంబ పాలనపై రాహుల్, ప్రియాంక గాంధీలు మాట్లాడటం పెద్ద జోకని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 2023, అక్టోబర్ 19వ తేదీ గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ లో బిఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డితో కలిసి కవిత మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.." కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి పక్కా తెలంగాణ వ్యతిరేకి. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ రాహుల్ గాంధీ చదువుతున్నారు. మోసం చేయడం కాంగ్రెస్ నైజం.. కాంగ్రెస్ కు ఓటేస్తే కర్ణాటక గతే పడుతుంది.
Also Read :- తగ్గిన బంగారం, వెండి ధరలు
24 గంటల కరెంటు ఇస్తామని కర్ణాటకలో హామీ ఇచ్చారు. ఇప్పుడు 5 గంటల కరెంటుతో సరిపెట్టుకోమంటున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా మూడు గంటల కరెంటే చాలంటున్నారు. కరెంటు కష్టాలు తెచ్చే కాంగ్రెస్ పార్టీ మనకెందుకు. దేశంలో ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్. మళ్లీ మూడోసారి కెసిఆర్ కే మద్దతుగా నిలబడుద్దాం" అని చెప్పారు.